Monday, April 29, 2024

భ్ర‌మ‌రాంభ థియేట‌ర్ లో ర‌చ్చ చేసిన ‘ఉపాస‌న’

ఆర్ ఆర్ ఆర్ చిత్రం చూడ‌టానికి భ్ర‌మ‌రాంభ థియేట‌ర్ లో ఫ్యామీలీతో క‌లిసి వ‌చ్చాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. కాగా రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీతో పాటు.. డైరెక్ట‌ర్ రాజమౌళి కూడా వ‌చ్చాడు. అయితే ఈ సినిమా చూస్తున్న స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న.. ర‌చ్చ ర‌చ్చ చేసింది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ స‌మ‌యంలో, నాటు నాటు సాంగ్ స‌మ‌యంలో పేప‌ర్లు చింపి పైకి చ‌ల్లుతూ ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈల‌లు వేస్తున్న అభిమానుల పైకి పేప‌ర్ల‌ను చింపుతూ ర‌చ్చ చేసింది. కాగా ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement