Friday, May 17, 2024

బ‌రేలీలో మార‌థాన్ లో తోపులాట – గాయ‌ప‌డిన విద్యార్థులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌రేలీలో కాంగ్రెస్ నిర్వ‌హించిన మార‌థాన్ లో పెద్ద సంఖ్య‌లో స్కూల్ విద్యార్థులు, మ‌హిళ‌లు మార‌థాన్ లో పాల్గొన్నారు. ఒక‌రినొక‌రు తోసుకుంటూ ప‌రిగెత్త‌డంతో ప‌లువురు కింద‌ప‌డిపోయారు. దాంతో ప‌లువురు విద్యార్థుల‌కు స్వ‌ల్ప గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ నిర్వ‌హించిన మ‌హిళ‌ల మార‌థాన్ లో ల‌డ్కీహూన్, ల‌డ్ శ‌క్తిహూన్ అంటే నేను అమ్మాయిని, నేను పోరాడ‌గ‌ల‌న‌నే స్లోగ‌న్ తో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక స్కూల్ విద్యార్థుల‌ను తీసుకువ‌చ్చారు.

మారథాన్‌లో పరుగెత్తే సమయంలో అమ్మాయిలు ఒకరిని మరొకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో అంతా కింద పడిపోయారు. పాల్గొన్న వారిలో కొందరికి గాయాలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో చాలా మంది చిన్నారులకు మాస్కులు లేకుండా కనిపించారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చకు కారణంగా మారుతోంది. చిన్న పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ కుట్ర అంటూ కాంగ్రెస్ నేత, మాజీ మేయర్ సుప్రియా అరోన్ అసంబద్ధ ప్రకటన చేశారు. వైష్ణోదేవిలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement