Wednesday, May 1, 2024

ఆస‌క్తిక‌రంగా య‌శోద – ఫ‌స్ట్ గ్లింప్స్

య‌శోద చిత్రం గ్లింప్స్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని హ‌రి-హ‌రీష్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో బారి అంచనాలు రేకెత్తించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తో మరిన్నీ అంచనాలు పెంచేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో సమంత లుక్ అదిరిపోయింది. హాస్పిటల్ బెడ్ పై కళ్ళు తెరిచిన సమంత .. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కనిపించింది. బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. అయితే హాస్ప‌ట‌ల్ బెడ్ పై సామ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది…. తన చేతికి ఉన్న ఆ బ్యాండ్ ఏంటి.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

https://twitter.com/Samanthaprabhu2/status/1522088220535582723
Advertisement

తాజా వార్తలు

Advertisement