Thursday, May 9, 2024

కొత్త‌గా 16,412క‌రోనా కేసులు

గ‌డిచిన 24గంటల్లో 12,751కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా.. మహమ్మారి బారినపడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతున్నది. 206.88కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,071 మంది కోలుకున్నారు. వైరస్‌ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.50శాతం, వ్లీకీ పాజిటివిటీ రేటు 4.69శాతం, రికవరీ రేటు 98.51శాతంగా ఉందని మంత్రిత్వశాఖ వివరించింది. గత 24గంటల్లో 3,63,855 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటి వరకు 87.52 కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement