Saturday, May 18, 2024

సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ‘సెబాస్టియ‌న్ పిసి 524’

బాలాజీ స‌య్య‌పురెడ్డి తెర‌కెక్కిస్తోన్న చిత్రం సెబాస్టియ‌న్ పిసి 524. ఈ చిత్రంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటించాడు. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈమేరకు సెన్సార్‌ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటించారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement