Saturday, May 11, 2024

క‌న్నడ‌నాట మ‌నోళ్ల ప్ర‌చారం….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ పోరులో పోటా పోటీ- ప్రచారం నిర్వహించేందు
కు ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సంసిద్ధం కావాలని పార్టీల అధినాయకత్వాలు ఇప్పటికే పార్టీ యంత్రాగాన్ని కోరినట్టు- తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కొన్ని కర్ణాటక ప్రాంతాలకు తెలంగాణ నేతలు వెళ్లి అడపా దడపా ప్రచారం నిర్వహిస్తున్నట్టు- సమాచారం. ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఆ రాష్ట్రానికి తరలివెళ్లేందుకు తమ పర్యటనలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుండగా 8వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. కనీసం రెండు వారాల పాటు- ఎన్నికల ప్రచా రంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న పార్టీల రాష్ట్ర నేతలు ఈ నెల 20 నుంచి తమకు అప్పగించిన నియోజక వర్గాల్లో మకాం వేయాలని సంకల్పించినట్టు- తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాల నడుమ హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉందని సర్వే సంస్థలు చెబుతుండడంతో ఈ రెండు ప్రధాన పార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంకంగా తీసు
కుని ఉధృతంగా ప్రచారం నిర్వహి స్తున్న సంగతి తెలిసిందే.

భారాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జనతాదళ్‌ (సెక్యులర్‌) తరపున ప్రచా రం నిర్వహించే అవకాశం ఉంది. కేసీఆర్‌తో పాటు- ఏడెనిమిది మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు కర్ణాటక ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం జరపను న్నట్టు- తెలుస్తోంది. తమ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ అధినేత కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఆహ్వానించినట్టు- పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. తప్పని సరిగా ప్రచారంలో పాల్గొంటున్నట్టు- కేసీఆర్‌ ఈ సందర్భంగా కుమారస్వామికి హామీ ఇచ్చారని ఆ నేత వివరించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించి రెండు రోజుల క్రితం భారాసకు చెందిన పలువురు నేతలతో జరిపిన సమా వేశంలో కేసీఆర్‌ సమాలోచనలు జరిపినట్టు- తెలుస్తోంది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయచూర్‌, గుల్భర్గా, బీదర్‌, గంగావతి, కొప్పోల్‌తో సహా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజక వర్గాల్లో జరిపే ఎన్నికల బహిరంగ సభల్లో కుమారస్వామితో కలిసి వేదిక పంచుకోవా లని, బెంగళూరు మహానగరంలో నిర్వహించే ప్రచార కార్య క్రమాలు రోడ్‌ షోలలో భాగస్వామ్యం కావాలని నిర్ణయిం చినట్టు- చెబుతున్నారు. కుమారస్వామితో మాట్లాడి ఎన్ని కల ప్రచార కార్యక్రమాన్ని సిద్ధం చేయాలని కేసీఆర్‌ ప్రతిపా దించారు. భారాస తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్‌ చైర్మన్లను కర్ణాటక ఎన్ని కల ప్రచారానికి పంపించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా మంత్రులు, ప్రజా ప్రతి నిధులను వారికి పక్కనే ఉన్న రాయచూర్‌, గుల్భర్గా, గంగా వతి ప్రాంతాలకు పంపించే అవకాశం ఉంది. మెదక్‌ జిల్లాకు చెందిన నేతలను బీదర్‌ నియోజకవర్గం, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను కర్ణాటక, మహారాష్ట్ర పొరుగున ఉన్న ప్రాంతాల్లో ప్రచారం జరిపేలా భారాస అధినాయకత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీ- రామారావు సైతం కన్నడ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని మంత్రి సన్నిహితులు చెబుతున్నారు. సాప్ట్‌nవేర్‌ సంస్థలు అధికంగా ఉన్న బెంగళూరు నగరంలోని కీలక నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు, వీధి సమావేశాలు (స్ట్రీట్‌ కార్నార్‌) మీటింగ్స్‌కు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు- సమాచారం.

ప్రచార బరిలో కాంగ్రెస్‌
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అగ్రనేతలంతా రెడీ అవుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ కీలక నేత శివకుమార్‌తో కీలక సమావేశం నిర్వహించిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ప్రచార రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు- సమాచారం. రేవంత్‌తో సహా అగ్రనేతలు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, సంపత్‌ కుమార్‌, భట్టి విక్రమార్క, మల్లు రవి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌ బాబు, సీతక్క, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి, గీతా రెడ్డితో పాటు- ఎన్‌ఎస్‌యుఐ, యువజన, మహిళా కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా ఈ నెల 20 తర్వాత కర్ణాటకకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రచారంలో పాల్గొనే వారి పేర్లను నమోదు చేసుకోవాలని రేవంత్‌ కోరడంతో వంద మందికి పైగా ఆసక్తి కనబరిచినట్టు- సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించి అధికారం హస్తగతం చేసుకుంటే తెలంగాణలోనూ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడుతుందని రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పడంతో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పార్టీలో పోటీ- పెరిగినట్టు- చెబుతున్నారు.

ప్రచారానికి భాజపా సై
కన్నడ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌ రెడ్డి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు అర్వింద్‌, సోయం బాపురావు, కీలక నేతలు డాక్టర్‌ కోవ లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు, ఇంద్రసేనా రెడ్డి, రామచంద్రా రెడ్డి, గరికపాటి మోహన్‌ రావు, రేవూరి ప్రకాష్‌ రెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు- భాజపా యువమోర్చా, మహిళా మోర్చా నాయకులు, ఆయా జిల్లాల పార్టీ అధక్షులు, హైదరాబాద్‌ నగరానికి చెందిన కార్పోరేటర్లు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు. ప్రచారంలో పాల్గొనే వారి జాబితాను పార్టీ రాష్ట్ర పెద్దలు కర్ణాటక రాష్ట్ర భాజపా ఎన్నికల ఇన్‌చార్జ్‌కి పంపినట్టు- సమాచారం. అక్కడి నుంచి వచ్చే సూచనల ప్రకారం ఎవరు ఏ నియోజకవర్గాలకు వెళ్లాలో అక్కడికి బయలుదేరి వెళతామని, ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తామని పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement