Tuesday, May 14, 2024

టీఎస్ ఎంసెట్ హాల్ టెకెట్లు విడుదల.. ఆన్‌లైన్ నుంచి ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు!

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. దీనికోసం జులైలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే స్టూడెంట్స్‌ www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్ల‌ను ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది.

జులై 11 వరకు హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసిన్‌.. జూలై 18, 19, 20వ తేదీ దాకా ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మే 28వ తేదీతో గడువు పూర్తవగా.. ఆలస్యంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికోసం లేట్‌ ఫీజుతో జులై 7వ తేదీ దాకా అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement