Sunday, April 21, 2024

Tripura: ఏం చేశారని ఓట్లు అడిగేందుకు వస్తున్నారో చెప్పాలే.. బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించిన మాణిక్​

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ తీరుపై ప్రతిపక్ష లీడర్​, సీపీఎం నేత మాణిక్​ సర్కార్​ విరుచుకుపడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా​ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓటెయ్యాలని ప్రజలను అడిగేందకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేని దద్దమ్మ సర్కార్​గా ఆయన అభివర్ణించారు. ‘‘ఏ హామీని నెరవేర్చనందుకు ప్రజలు మిమ్మల్నీ స్వాగతించాలో చెప్పాలే’’ అని గట్టిగనే నిలదీశారు మాణిక్​ సర్కార్​.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అసోంలోని రవీంద్ర భవన్‌లో ఇవ్వాల (మంగళవారం) జరిగిన పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన సీపీఎం నేత మాణిక్​ సర్కార్ ఏడో  వేతన సంఘం అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అసోంకు చెందిన ఈ పెద్దమనిషి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. తమకు ఓటు వేస్తే మొదటి సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడవ వేతన సంఘం మొదటి సమావేశంలోనే అమలు చేస్తామని అన్నారు. మరి వారి ప్రభుత్వంలో (బీజేపీ నేతలు) ఏదైనా హామీని నెరవేర్చారా? వారికి వారే ప్రశ్నించుకోవాలే.. అని సీపీఐ(ఎం) నేత మండిపడ్డారు.

ఇప్పుడు మళ్లీ ఈ కాషాయ శిబిరం ‘బూత్ బిజోయ్ అభియాన్’ (బూత్‌లను గెలుచుకునే ప్రచారం)ని ప్రారంభించిందని.. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం “పోల్ మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన దానికంటే ఎక్కువ” చేసిందని హిమంత చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 60 సీట్లలో బీజేపీ 55 స్థానాలను కైవసం చేసుకుంటుందని హిమంత ఎట్లా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

వారి వాగ్దానాల విషయంలో పాలకవర్గాన్ని ఎగతాళి చేశారు సిపిఐ(ఎం) లీడర్​ మాణిక్​ సర్కార్​. “రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎంతో కోపంగా ఉన్నారు.  ఆ కోపంలో ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నారు. 2014లో త్రిపుర హైకోర్టు వారి నియామకాలను చట్టవిరుద్ధంగా పరిగణించింది. దీంతో 10,323 మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయారు”అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇక.. తాము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే త్రిపురలో తన ముఖం చూపించనని ఈ పెద్దమనిషి (హిమంత) అప్పట్లో అన్నారు. అతను మళ్లీ వస్తే రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని మాణిక్​ సర్కార్​ ప్రజలకు పిలుపునిచ్చారు.   ‘‘7వ కేంద్ర వేతన సంఘం అమలు గురించి మరచిపోండి. ఉద్యోగులకు ఇంకా 35-36 శాతం డియర్‌నెస్ అలవెన్స్ రావాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం ఐదు నుంచి ఏడు శాతం డీఏను విడుదల చేసేందుకు యత్నించవచ్చు. దాంతో మిమ్మల్ని (ప్రజలు) మళ్లీ ఓటు వేయమని అడిగితే.. ఈసారి కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉండండి ”అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు నుంచి రిటైరయ్యారని, అయితే అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని సర్కార్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement