Sunday, May 19, 2024

టాలీవుడ్ హీరోలకు షాక్.. కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లకు జరిమానా

నిబంధనలకు విరుద్ధంగా కార్లు బ్లాక్ ఫిల్మ్‌లో తిరుగుతున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. కార్లకున్న బ్లాక్ ఫిల్మ్ లను తొలగిస్తూ జరిమానాలను విధిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలిబ్రిటీలు, ప్రముఖులు నివాసముండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ కారుకున్న బ్లాక్‌ఫిల్మ్‌ను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.. తాజాగా టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌ కార్లకున్న నల్ల తెరలను తొలగించి చలానాలు విధించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ చౌరస్తాలో పోలీసులు నిన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న కల్యాణ్‌రామ్, అల్లు అర్జున్ కార్లను ఆపారు. అనంతరం వాటికున్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించారు. అలాగే, నిబంధనలు పాటించని మరో 80కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement