వరంగల్ జిల్లా రామన్నపేటలో విషాదం నెలకొంది. ఎల్లుండి పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. ఇవ్వాల (బుధవారం) దుర్మరణం పాలయ్యాడు. దేవరకొండ సాగరాచారి (28) పెళ్లి పనుల్లో భాగంగా ఇంటి దగ్గర నుంచి వేరే ఊరికి బైక్‌పై వెళుతుండగా, వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -
