Sunday, May 5, 2024

పునీత్ రాజ్ కుమార్ మృతి.. షాక్ లో సినీ ప్రముఖులు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త దక్షణాది చిత్రపరిశ్రమకు షాక్ కి గురి చేసింది. పునీత్ మరణవార్తతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచు లక్ష్మి, మంచు మనోజ్, నటుడు సోనుసూద్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శాండల్ వుడ్ లో పవర్ స్టార్ పునీత్ రాజ్ శుక్రవారం ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కూప్పకూలిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని విక్రమ్ ఆసుపత్రి డాక్టర్స్ అధికారికంగా ప్రకటించారు. పునీత్ మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ సర్కార్ కు షాక్.. పాలమూరు-రంగారెడ్డి పథకానికి బ్రేక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement