Sunday, May 19, 2024

నేటి బంగారం ధరలు..పెరిగిన వెండి

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర మళ్లీ తగ్గింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 40 రూపాయల మేర పతనమైంది. దీంతో అక్టోబర్ 19న 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46 వేల 420 వద్ద ఉంది. అదే 24 క్యారెట్లకు చెందిన బంగారం విషయానికి వస్తే.. దీనిని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తాం. వీటిని మాత్రం బంగారు ఆభరణాలు తయారుచేసేందుకు ఉపయోగించరు. హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.40 తగ్గి రూ.50 వేల 640కి చేరింది. వెండి విషయానికి వస్తే ఇది పూర్తి భిన్నంగా ట్రేడవుతోంది. గత వారం రోజుల్లో రూ.6500 మేర పతనమైన సిల్వర్ రేటు మళ్లీ పెరిగింది. ఒక్కరోజే కేజీకి 1300 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,800కు చేరింది. విజయవాడలోనూ రేట్లు ఇలానే ఉన్నాయి. ఇక దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో అక్కడి పరిస్థితులను బట్టి ధరల్లో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement