Monday, April 29, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల ధర ఇవాళ 10 గ్రాములకురూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.55 వేల 850 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం హైదరాబాద్‌లో తులానికి రూ.110 మేర పెరిగి ప్రస్తుతం రూ.60 వేల 930కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు రూ.100 మేర పెరిగి ప్రస్తుతం రూ.56 వేల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు ఢిల్లీలో 10 గ్రాములకు రూ.110 మేర పెరిగింది. ఇవాళ రూ.61 వేల 80 పలుకుతోంది. వెండి విషయానికి వస్తే బంగారం దారిలోనే పరుగులు పెడుతోంది. కొత్త రికార్డులు తిరగరాసేందుకు వేగంగా దూసుకెళ్తోంది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.200 పెరిగింది. ప్రస్తుతం కిలో రేటు రూ.76 వేల 400 పలుకుతోంది. ఇక మన హైదరాబాద్‌లో కిలో వెండి రేటు చూసుకుంటే రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.80 వేల 400 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు కాస్త ఎక్కువ, గోల్డ్ రేటు కాస్త తక్కువగా ఉంటుంది. అందుకు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు, ఇతర అంశాలు కారణమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement