Sunday, May 5, 2024

Victory | తెలంగాణ ఘనకీర్తికి అద్ధం పట్టేలా.. రాష్ట్ర అవరతణ దశాబ్ది ఉత్సవాలు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రామస్థాయినుంచి రాష్ట్ర రాజధాని వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2నుంచి 21 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేంతగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని దశ దిశలా చాటేలా ప్రతీ హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామస్థాయినుంచి రాష్ట్ర రాజధాని వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2నుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదో వసంతంలోకి అడిగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేంతగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో మొదటిరోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అదేరోజు రాష్ట్ర మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్‌ 2నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగిగుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయసున్న రాష్ట్రం, అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నది” అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

- Advertisement -

నేడు తెలంగాణ రాష్ట్రం దేశ.. ఆనికే ఒక రోల్‌ మోడల్‌గా మారిందన్నారు. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యచకితులవుతున్నారని చెప్పారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. వారికి ఒక దశలో నమ్మశక్యంగా అనిపించని తీరుగా మనం అద్బుత ప్రగతిని నమోదు చేసుకున్నాం” అని ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి పరుగులను వివరించారు.

అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడటంలో దార్షనికతను ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. అప్పుడే ప్రగతి ప్రస్తానం ఆగకుండా కొనసాగుతుందని, తెలంగాణలో అదే జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికిగానీ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్ధిష్ట దృక్పథం,, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాన ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యాచరణ దార్షనికతతో కూడుకొని ఉందనడానికి తొమ్మిదేండ్ల అనతికాంలో సాధించిన ప్రగతే నిదర్శనమన్నారు.

పేరుకు తొమ్మిదేండ్లయినా మొదటి ఏడాదితోపాటు కరోనా కాలపు రెండేళ్లుతో మూడేళ్ల కాలం వృధాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేళ్ల కాలంలోనే ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమన్నారు. వ్యవసాయం, విద్యుత్‌, తాగునీరు, సాగునీరు, పల్లెలు, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, ఆర్ధిక ప్రగతి, తెలంగాణకు పోటెత్తుతున్న పెట్టుబడులు, పారిశ్రామిక ఐటీ అభివృద్ధి, సింగరేణి వంటి అనేక రంగాల్లో జరిగిన ప్రగతిని సీఎం కేసీఆర్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement