Friday, April 26, 2024

Big Breaking: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్

నాగపూర్ – కేంద్ర రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరిని హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్ లోని గడ్కరి కార్యాలయానికి కాల్ చేసిన గుర్తు తెలియని దుండగులు చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి కార్యాలయంలోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు రెండు సార్లు బెదిరింపు కాల్‌లు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దావూద్ పేరుతో బెదిరింపులు వచ్చాయని తెలిపారు.  కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు 100 కోట్లు ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డబ్బులు ఇవ్వనందుకు చంపేస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే గడ్కరి నాగ్‌పూర్ కార్యాలయానికి భద్రతను పెంచారు. కాగా, ఈ బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement