Saturday, May 18, 2024

మేం ఫేమ‌స్ దోస్తులం..

చిన్నసినిమా అయి నప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నచిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. తాజా గా దర్శకుడు తరుణ్‌ భా స్కర్‌ మూడవ సింగిల్‌ ”దోస్తులం… ” పాటని విడుదల చేశారు. ఈ పాట ఒకరితోఒకరు స్నేహంగా ఉండ టంలో వున్న గొప్ప తనాన్ని వివ రించే పాట. గుడ్‌ -టైం ని సెల బ్రేట్‌ చేసు కొని, చెడు సమయాల్లో సహాయాన్ని అందించేది స్నేహం. కళ్యాణ్‌ నాయక్‌ స్వరపరిచారు, కోటి మామిడాలతో పాటు- సాహిత్యం కూడా అందం చారు. కాల భైరవ ఆలపించారు. ఈ పాటలో సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి మంచి స్నేహితులు. ఈ పాట ఒకరితో ఒకరు సన్నిహిత బంధాన్ని తెలిజేస్తుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుమంత్‌ ప్రభాస్‌ రచించి, దర్శకత్వం వహించగా, అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి నిర్మిస్తున్నారు. శ్యామ్‌ దూపాటి సినిమాటోగ్రాఫర్‌, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌. అరవింద్‌ మౌళి ఆర్ట్‌ డైరెక్టర్‌. అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ ఈ సినిమాను పంపిణీచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement