Wednesday, December 4, 2024

Predator: వీడు మనిషి కాదు, మానవ మృగం.. నమ్మి వచ్చిన అమ్మాయిని నరికి ముక్కలు చేశాడు!

వాళ్లిద్దరూ యుక్త వయస్సులో ఉన్నారు. ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు.. అందులోనూ డీప్​గా లవ్​ చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇక.. తాము జీవితాంతం కలిసి ఉండడమే మంచిదని భావించి, లివిన్​ రిలేషన్​లో ఉన్నారు. ఇట్లా చాలాకాలం కొనసాగిన వారి సాన్నిహిత్యం, రొమాన్స్​ మధ్య చిన్న అవాంతరం వచ్చింది. ఇక అంతే.. ఆ అమ్మాయి ఆరు నెలల నుంచి కనిపించకుండా పోయింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ వార్త చదవాలంటే కాస్త గట్స్​ ఉండాలి. బలహీనమైన గుండె ఉన్న వారు చదవకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ దారుణం చదివి కన్నీరు పెట్టకుండా ఎవరూ ఉండలేరు. ఇక ఆక్రోషం పట్టలేక ప్రతి ఒక్కరికీ పిడికిళ్లు బిగించుకోవడం సహజమే.. అంతటి దారుణఘటన ఢిల్లీలో జరిగింది. ముంబయిలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో 27 ఏళ్ల శ్రద్ద వాకర్​ పనిచేస్తోంది. అదే కంపెనీలో ఆఫ్తాబ్​ అమీన్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య చాలారోజులుగా సాన్నిహిత్యం ప్రేమగా అంకురించింది. అది కాస్త లివ్​ ఇన్​ రిలేషన్​ దాకా వెళ్లింది. ఇక నిత్యం రొమాన్స్​లో మునిగి తేలిన వీరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పీక్​ లెవల్​కి చేరుకున్నారు.

వీరిమధ్య రొమాన్స్ ఘోరంగా జరిగిన సందర్భంలో తన ప్రియురాలిని గొంతు కోసి, ముక్కలుగా నరికి, ఆమె శరీర భాగాలను ఢిల్లీ అంతటా వెదజల్లాడు. బాధితురాలు 27 ఏళ్ల శ్రద్ధా వాకర్​గా పోలీసులు గుర్తించారు. ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది ఆమె. ముంబయిలో మొదలైన వీరి ప్రేమ కథకు తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో వారు ఢిల్లీకి పారిపోయారు. అయితే.. శ్రద్ధా పెళ్లి కోసం ఆఫ్తాబ్‌ను ఒత్తిడి చేయడం మొదలెట్టింది. ఇట్లా ఈ అన్యోన్యమైన జంట మధ్య విభేదాలు చెలరేగాయి. శ్రద్ధాని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని తన భాగస్వామి ఆఫ్తాబ్​ భయంకరమైన రీతిలో ఆమెను అంతం చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు.

దాదాపు ఆరు నెలల పాటు ఈ హత్య వెలుగులోకి రాలేదు. ఈ దారుణమైన వ్యవహారంలో ఇది అత్యంత నమ్మశక్యం కాని విషయం. బాధితురాలి తండ్రి తన కూతురు తప్పిపోయిందని, చాలా రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా నిందితుడు వారి కళ్లెదుటే, ఏమీ ఎరుగనట్టే తిరగేవాడు. ఒకానొక క్షణంలో అనుమానం వచ్చిన పోలీసులు అతని ఇంటి తలుపు తట్టారు.

- Advertisement -

కోల్డ్​ బ్లడెడ్​ మర్డర్​ గురించి ఒక్కో విషయం వెలుగులోకి..

  • బాధితురాలు ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీ కాల్ సెంటర్‌లో పని చేసేది. ఇక్కడే ఆమెకు అఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడింది. త్వరలో ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అయితే శ్రద్ధా కుటుంబం వారి బంధాన్ని అంగీకరించలేదు.
  • వీరిద్దరు ఢిల్లీకి పారిపోయారు. అక్కడ వారు ఛతర్‌పూర్ ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. శ్రద్ధ అఫ్తాబ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, అతను ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
  • మే 18న పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో అఫ్తాబ్ శ్రద్ధా గొంతు నులిమి చంపేశాడు. అరెస్టు నుండి తప్పించుకోవడానికి అతను ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికేశాడు.
  • శ్రద్ధా అవశేషాలను భద్రపరచడానికి ఆఫ్తాబ్​300 లీటర్ల ఫ్రిజ్‌ కొన్నాడు. ఈ విషయాన్ని ఇంటరాగేషన్​లో అఫ్తాబ్ పోలీసులకు చెప్పాడు. ప్రతి రోజు అతను కొన్ని శరీర భాగాలను పారవేసేవాడు. కుళ్లిపోయిన వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగరబత్తిని వెలిగించాడు. ఇంతటి దారుణ ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement