Friday, May 17, 2024

ఇలాంటి సంతకం మ‌రెక్క‌డా ఉండదు.. ఓ ఆఫీస‌ర్ సంతకానికి యునెస్కో ఫిదా

సంత‌కం అంటే ఎట్లుండాలే.. చాలా మంది అయితే కోడి కెలికిన‌ట్టు పెట్టేసి వ‌దిలేస్తారు. కానీ, ఇయ‌న మాత్రం త‌న సంత‌కాన్ని వీర లెవ‌ల్‌లో పెట్ట‌డంతో దీనికి ఏకంగా యునెస్కోనే ఫిదా అయ్యింది.. పేరును సంక్షిప్తంగా సంతకంలో పొందుపరుస్తారన్న విషయం అంద‌రికీ తెలిసిందే. అయితే ఒక్కొక్కరి సంతకం ఒక్కోలా ఉంటుంది. కర్నాటకలోని హోనావర్ ప్రాంతానికి చెందిన శాంతయ్య అనే అధికారి సంతకం మాత్రం చాలా డిఫ‌రెంట్ అని చెప్పాలి. శాంతయ్య సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకే, తన సంతకం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మరెవరూ ఫోర్జరీ చేసేందుకు వీలు లేకుండా, ఎంతో కష్టపడి, సంక్లిష్టమైన రీతిలో సంతకం చేయడం అలవర్చుకున్నారు.

కాగా, శాంతయ్య సంతకం క‌ర్నాట‌క‌కే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో వరకు పాకింది. ఇంతకంటే అద్భుతమైన సంతకం ప్రపంచంలో మరెక్కడా ఉండదు, ఎవరూ చేయలేరంటూ యునెస్కో సైతం శాంతయ్యకు కితాబునిచ్చింది. గతంలో ఓ హైకోర్టు జడ్జి కూడా శాంతయ్య సంతకం చూసి ఆశ్చర్యపోయారట. ప్రత్యేకంగా శాంతయ్యను ఇంటికి పిలిపించుకుని అభినందించి పంపిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు శాంతయ్య సంతకంతో పాటు, మరికొన్ని విచిత్రమైన సంతకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement