Sunday, April 28, 2024

వామ్మో.. 12అడుగుల పాముకి ముద్దుపెట్టిన యువ‌కుడు

పాముని చూస్తేనే గుండె ఆగిపోతుంది..అటువంటిదిఏకంగా 12అడుగుల పాముని చూస్తేనే ఇంకేమ‌యినా ఉందా.. అలాంటిది ఓ కుర్రాడు ఏకంగా పామును పట్టుకొని ఆటలాడాడు. అది అలాంటి, ఇలాంటి పాము కూడా కాదు. ఆ పాము ఏకంగా 12 అడుగులు ఉంది. అందులోనూ ప్రపంచలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా అది. అలాంటి పామును పట్టుకొని ఆటలాడాడు. ఆ పాముని ఫోటోలో చూస్తే కూడా భయం కలిగేలా ఉంది. ఒక మనిషి పొడవుకు రెండింతల ఎత్తు, దానికి తగిన లావు, చూడటానికే భయం కల్పించేలా ఉంది. కొందరికైతే దానిని దూరం నుంచి చూసినా గుండె ఆగిపోతది. అలాంటి పాముని ఓ కుర్రాడు ఎడమ చేతితో పట్టుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోలో పాము పడగ విప్పి ఇంతెత్తున లేచింది కూడా. ఈ పాముకు ఎదురుగా ఓ వ్యక్తి ఉన్నాడు. అతను పామును ఎడమ చేత్తో పట్టుకుని ఉన్నాడు. కొంచెం కూడా భయపడకుండా, అతను పామును పట్టుకున్న తీరుకు అందరూ షాకైపోతున్నారు. పామును పట్టుకోవడంతో ఆగలేదు. దానికి ముద్దు కూడా పెట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరల్ గా మారింది. nicthewrangler అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోని షేర్ చేయగా, దానిని చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. అసలు కొంచెం కూడా భయం లేకుండా ఎలా బ్రో అంటూ ప్రశ్నిస్తున్నారు. అతని ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement