Saturday, October 12, 2024

Exclusive | బెంగ‌ళూరులో ట్రాఫిక్ మ‌రీ ఘోరం.. ఇలా వంట కూడా చేసుకోవ‌చ్చు!

కాంగ్రెస్‌ పాలిత క‌ర్నాట‌క రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు చెప్ప‌న‌ల‌వి కాదు. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పడుతోంది. లేటెస్ట్‌గా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్‌ సమస్యకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆ చిత్రాన్ని ఆమె ట్విట్ట‌ర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇది చూసిన చాలామంది నెటిజ‌న్లు రియ‌క్ట్ అయ్యారు. అయ్య బాబోయ్‌, బెంగ‌ళూరుకు వెళ్లి ట్రాఫిక్‌లో చిక్కకుంటూ అక్క‌డే వంట కూడా చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

షాపింగ్‌కు వెళ్లేంత సమయం..
బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకొన్న దీపాంశు అనే వ్య‌క్తికి విచిత్ర అనుభ‌వం ఎదురైంది. బెంగ‌ళూరు ట్రాఫిక్‌లో చిక్క‌కుపోయిన త‌న‌కు గూగుల్ నుంచి ఓ మెస్సేజ్ రావ‌డ‌మే దీనికి కార‌ణం. తాను షాపింగ్ కు వెళ్లిన‌ట్టు ‘మీ షాపింగ్‌ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్‌ నుంచి నోటిఫికేషన్‌ వచ్చింది. అయితే.. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్‌మాల్‌ పక్కన ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడమే దీనికి కారణంగా చెప్పాడు.

సమస్య పరిష్కరించడంలో విఫలం…
గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించడం లేదని ప్రజలు అంటున్నారు. ఆపరేషన్‌ కలమం, ఆపరేషన్‌ హస్త అంటూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలు ప‌రిష్క‌రించ‌డంలో చూపాలని మండిపడుతున్నారు. బెంగ‌ళూరు అంటే భ‌య‌ప‌డి బైపాస్‌లో వెళ్లిన వారికి కూడా ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్ప‌డం లేదని చాలామంది మండిప‌డుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement