Friday, October 11, 2024

కుంట‌లు క‌బ్జా చేసి వెంచ‌ర్లేశారు.. స‌ర్వేల‌తో లెక్క తేలుస్తానంటున్న‌ అధికారి

ఎల్లారెడ్డి, (ప్రభన్యూస్‌) : కుంటలు, చెరువులు రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారుల అధీనంలో ఉండేవి 2009 ప్రభుతం లో కుంటలను నీటిపారుదల శాఖకు బదిలిచేసింది. దీంతో కుంటలను అభివద్ధి చేయాలని సంకల్పంతో మిషన్‌ కాకతీయ పథకంను రూపొందించి అభివృద్ధి చేసింది ప్రభుత్వం. గత పంచాయతీరాజ్‌, రెవెన్యూ అదికారుల అధీనం 22 కుంటలు, చెరువులు ఉండేవి అం దులో కొన్ని కుంటలు భూస్థాపితం చేశారు. కబ్జారాయుళ్ల చేతుల్లో వెంచర్లు గా వెలిశాయి. ఆ వెంచర్లలో భవనాలు వెలిశాయి. ఇప్పుడు సుమారు 10 నుండి 14 కుంటలు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే కుం టలు మాయమయ్యాయి.

మాయమైపోయిన కుంటలను వెలికి తీసేందుకు నీటి పారుదల అధికారి డి ఈ వెంక టేశ్వర్లు రంగంలోకి దిగారు. సాదా సీదాగా వుండే అధికారి, నిజాయతి కి పెట్టిన పేరు ఆయ‌న‌. ఏ కుంటను వదిలేది లేదు కబ్జా రాయుళ్ల నుండి బయటికి రప్పించే వరకు నా పని ఆగదు నేను ఆపను అన్నారు. రెవెన్యూ అధికారులు సైతం కుంటల పైళ్ళు బూజు దులుపుతున్నారు. ఇరిగేషన్‌కు సంభం దించిన కుంటలు అధికారుకు తెలియ కుండ ఎలా మాయమయ్యాయి. పర్మిషన్‌ ఎవరిచ్చారో వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇప్పుడికైతే రెండు కుంటల పై కొరడా జులిపించ డంతో కబ్జారాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ఒక అధికారి హస్తం ఉందని ఆ అధికారితో పాటు ఇద్దర్లు ముగ్గురు పాత్రికేయులను కలుపుకున్నటుపుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పాత్రికేయులకు ముడుపులు కూడా ముట్టయాన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా కబ్జాకోరులు కుంటలపై పడి క‌బ్జా చేస్తున్నారు. ఇప్పటికే పోకలకుంట వద్ద సిమెంటు బెంచీలు కూర్చో డానికి ఏర్పాటు చేశారు. పట్టణంలోని మురికినిరు వెళ్ళేనేందుకు పైపులు కూడా ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement