Sunday, April 14, 2024

Story: బాగా దెబ్బ‌తిన్న రోడ్లు.. రిపేర్లు చేయ‌కుంటే జ‌ర్నీ క‌ష్ట‌మే!

సిరికొండ, (ప్రభన్యూస్‌) : కొండాపూర్‌ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్డు పై ప్రయాణించాలంటే నరకాన్ని తలపిస్తుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఒకప్పుడు పంచాయత్‌ రాజ్‌ శాఖ నుం చి రోడ్లు భవనాల శాఖ డిపార్టుమెంటుకు రోడ్లు బదలాయించరంటే ఆ రోడ్డు రూపురేకలు మా రుతాయని ఆ ప్రాంతం ప్రజలు సంబరపడేవా రు. కాని పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటే పప్పులో కలిసినట్లే.

ఇరవై సంవత్సరాల క్రితం కొండాపూర్‌ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్డును బిటి రోడ్డుగా మార్చారు. అప్పటి నుం చి ఆ రోడ్డు గురించి పట్టించుకున్నవారే లేరు. మరీ ముఖ్యంగా కొండాపూర్‌ నుంచి అన్నారం ఎక్స రోడ్డు వరకు ఏడు కిలోమీటర్ల రోడ్డు పై వాహనాల ద్వారా ప్రయాణించే బదులు నడక ప్రయాణం సులువని అంటున్నారు. బీమ్‌ గల్‌ నుంచి సిరికొండ మీదుగా హైదరాబాద్‌ వెళ్ళ డానికి వ్యాపారులకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది.అందువల్ల వ్యాపారాలు ఈ రూట్లో హైదరాబాద్‌ వెళ్ళడానికి వ్యాపారాలు ఇష్టపడుతుంటారు.

గల్ఫ్‌ దేశాలనుంచి వచ్చే వారు భీంగల్‌, వెూర్తాడ్‌, వేల్పూర్‌, కమ్మర్‌ పల్లి, మెట్‌పల్లి ప్రాంతాలకు వెళ్లేవారు దూరం తగ్గు తుందని ఈ రోడ్డు పై ఆయా ప్రాంతాలకు ప్రయాణం కొనసాగిస్తారు. భీమ్‌గల్‌, వెూర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాలకు చెందిన వ్యాపారాలు ఈ రోడ్డు పై తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ రోడ్డు ప్రతి రోజు ప్రయాణికులతో తీరిక లేకుండా రద్దీగా ఉంటుంది. సిరికొండ నుంచి కామారెడ్డి వెళ్లే రోడ్డు గురించి రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి.

తూంపల్లి నుంచి రెడ్డి పేట గ్రామానికి ప్రతి రోజు పాలు తరలించే రా మ్‌ అనే యువకుడు మాట్లాడుతూ కొండాపూర్‌ నుంచి అటవీ గుండా ప్రయాణించే ఏడు కిలో మీటర్ల రోడ్డు పరిస్థితి ఆధ్వనంగా తయారైంద న్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తి గా చెడిపోయింది. వర్షపు నీరు వెళ్ళడానికి మా ర్గం లేక వర్షపు నీరు రోడ్డు పైకి ప్రవహించడం వల్ల రోడ్లు ప్రయాణించడానికి వీలు లేకుండా రోడ్లు జలమయం అయ్యాయి. ఇకనైన అధికారు లు, ప్రజా ప్రతినిధులు కొండాపూర్‌ నుంచి అ న్నారం ఎక్స రోడ్డు వరకు గల రోడ్డును బాగు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement