Wednesday, March 27, 2024

Alert: ఫోన్​లో మునిగిపోయిన తల్లి.. రెప్పపాటులో యాక్సిడెంట్​నుంచి బయటపడ్డ కూతురు! (వీడియో)

స్మార్ట్​ఫోన్​ యుగంలో తల్లిదండ్రుల తీరు ఎట్లుందో ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ఫోన్​లో మాట్లాడుతూ స్కూల్​కు పంపాల్సిన చిన్నారిని రోడ్డుమీదికి వదిలేసింది ఓ తల్లి.. అంతలోనే ఆ రూట్​లో ఓ కారు రావడం.. కనురెప్ప మూసి తెరిచే టైమ్​లో యాక్సెడెంట్ తప్పిపోయింది..

వీడియో చూస్తున్న వారు హమ్మయ్య అని అనుకోవాల్సిందే. ఎందుకంటే ఆ పాపకు దేవుడిలా వచ్చి కాపాడాడు ఓ ఆర్మీ పర్సన్​. అంతేకాకుండా ఆ పాపను స్లిట్​ ఆఫ్​ సెకన్స్​లో పట్టుకుని కారు యాక్సిడెంట్​ నుంచి కాపాడడమే కాకుండా అప్పటికీ ఆ తల్లి వదలకుండా మాట్లాడుతున్న ఫోన్​ని లాగేసుకుని నేలకు విసిరి కొడతాడు.

ఈ వీడియో చూసిన తల్లిదండ్రుల్లో కానీ, మీకు తెలిసిన వారికి ఎవరికైనా కానీ ఇట్లాంటి విపరీత ధోరణి ఉంటే ఆ అలవాటు నుంచి వారిని కాపాడండి. ఫోన్​ వాడకం మంచిదే కానీ, అతి వద్దని చెప్పండి.. ఈ వీడియోను వారికి చూపించి వారిలో మార్పు వచ్చేలా ప్రయత్నం చేయండి..

వీడియో లింక్​ కోసం.. www.prabhanews.comలో చూడండి..​

Advertisement

తాజా వార్తలు

Advertisement