Friday, May 3, 2024

ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్ .. శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌

దివంగ‌త న‌టి శ్రీదేవి మ‌ర‌ణించి ఐదు సంవ‌త్స‌రాలు అవుతోంది. అయితే ఇప్పుడు ఆమె జీవిత చ‌రిత్ర పుస్త‌కం రూపంలోకి రానుంది..ఈ పుస్త‌కానికి.. ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్ అని టైటిల్ పెట్టారు. పుస్తకం ముఖచిత్రాన్ని వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ పోస్ట్‌ చేసింది. ‘శ్రీదేవి జీవితం ఆధారంగా బయోగ్రఫిని ప్రచురిస్తున్నామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఆమె ఒక సుప్రసిద్ధ, నిజమైన సూపర్‌స్లార్‌’ అని రాసింది. ఈ పుస్తకాన్ని ఆమె భర్త..నిర్మాత బోని కపూర్ విడుదల చేయనున్నారు. త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రచురణకర్తలు కృతనిశ్చయంతో ఉన్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. శ్రీదేవి జీవిత చరిత్రను ఈ పుస్తకం ద్వారా ఆవిష్కరించనున్నారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ సంస్థ దీనిపై సర్వ హక్కులు కలిగి ఉన్నది. శ్రీదేవి బయోగ్రఫీపుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌తో పాటు బోనీ కపూర్‌ కూడా విడివిడిగా ఇన్‌స్టాగ్రాంలో అధికారిక ప్రకటన చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement