Tuesday, May 28, 2024

మెగా ఫ్యామిలీకి ధ‌న్య‌వాదాలు – చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ మిస్స‌య్యా – ఉపేంద్ర‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం గ‌ని. ఈ చిత్రంలో క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర కీల‌క పాత్ర‌ని పోషించారు
ఇక రామ్ గోపాల్ వర్మ కూడా ఉపేంద్ర హీరోగా మాఫియా డాన్ కథాంశంతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. 24 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఉపేంద్ర’ సినిమా నుంచి తాను ఏంటో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 24 ఏళ్ల క్రితం రాజశేఖర్ తో ‘ఓంకారం’ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సమయంలో…మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందన్నారు. ఆ సినిమాకు అశ్వనీదత్ గారు నిర్మాత అని… అయితే, తనకు ఆ సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం లేకపోయిందని, ఆ సినిమా చేయలేకపోయానని, ఇప్పటికీ దాని గురించి బాధ పడుతుంటాన‌న్నారు. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తో కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశానని, ఇప్పుడు వరుణ్ తేజ్ తో ‘గని’ చేశానని ఉపేంద్ర తెలిపారు. ఈ కుటుంబం తనకు మళ్లీ మళ్లీ అవకాశాలను ఇస్తోందని ధన్యవాదాలు తెలిపారు. కన్నడలో కూడా ‘గని’ ఘన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement