Sunday, March 3, 2024

Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. 86.80శాతం ఉత్తీర్ణత

తెలంగాణ టెన్త్ క్లాస్ ఫలితాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేశారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 86.80శాతం ఉత్తీర్ణత సాధించారు. నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా, వికారాబాద్ 59.46శాతంతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు మొత్తం 4,84,370 మంది హాజరయ్యారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో 86.80శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉన్నారు. బాలికల్లో మొత్తం 88.53శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 84.68శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఫలితాల్లో 25పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణులు కాకపోవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement