Thursday, February 22, 2024

రేపు తెలంగాణ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల

హైద‌రాబాద్ : తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు రేపు విడుద‌ల కానున్నాయి. ప‌ది ఫ‌లితాల‌ను బుధ‌వారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు. ప‌ది ఫ‌లితాల కోసం manabadi వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు ప‌ది ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్‌కు 99.63 శాతం మంది విద్యార్థులు హాజ‌రయ్యారు. ప‌ది ప‌రీక్ష‌ల‌కు రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది ఎగ్జామ్స్ రాశారు. 1,809 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేదు. ప్ర‌యివేటు విద్యార్థులు 443 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement