Monday, May 6, 2024

బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలపై తాడేపల్లి కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. పరీక్షల సాధ్యాసాధ్యాలపై ఈ భేటీలో చర్చించారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అటు టెన్త్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. టీచర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతే పరీక్షలు జరపాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసినట్లు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. టీచర్లను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలు వేయలేమని అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలపై ప్రభుత్వం మళ్లీ జూలైలో సమీక్ష చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement