Friday, April 26, 2024

దేశంలో తెలంగాణ టాప్, స్వచ్ఛ సర్వేక్షణ్​లో అవార్డుల పంట.. ప్రకటించిన కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలోని పురపాలికలు మరోసారి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున‌ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను దక్కించుకున్నాయి. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2022లో భాగంగా తెలంగాణ‌లోని 16 మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు ఈ అవార్డులు ద‌క్కాయి. కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారాలను, గార్బెజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్‌సీ) వాటికి స్టార్ రేటింగ్ ఇచ్చి (జులై 2021 నుంచి జ‌న‌వ‌రి 2022 కాలానికి) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. దీంట్లో పారిశుద్ద్యం, మున్సిపల్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌, అయా అంశాలపై ప్రజల్లో అవగాహణ కల్పించడంపై దేశవ్యాప్తంగా ఉన్న 4,355 ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లో ఈ స్వచ్చసర్వేక్షణ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ పోటీలో భాగంగా తెలంగాణ‌లోని 16 పట్ట‌ణ స్థానిక సంస్థ‌లు అవార్డుల‌ను ద‌క్కించుకున్నాయి. వీటిని ఎంపిక చేయ‌డానికి 90అంశాల‌ను ప్రాతిప‌దిక‌న తీసుకున్నారు. ఈసంవత్సరం కూడా పెద్ద ఎత్తున‌ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపిక కావడంపై మంత్రి కే .తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పురపాలక సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు.

అవార్డుకు ఎంపికైన మున్సిపాలిటిలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ఇవే..

ఆదిబ‌ట్ల మున్సిపాలిటి

- Advertisement -

బడంగ్‌పేట్ మున్సిపాలిటి

భూత్పూర్ మున్సిపాలిటి

చండూర్ మున్సిపాలిటి

చిట్యాల మున్సిపాలిటి

గ‌జ్వేల్ మున్సిపాలిటి

ఘ‌ట్ కేస‌ర్ మున్సిపాలిటి

హుస్నాబాద్ మున్సిపాలిటి

కొంప‌ల్లి మున్సిపాలిటి

కోరుట్ల మున్సిపాలిటి

కొత్త‌ప‌ల్లి మున్సిపాలిటి
12.నేరుడుచ‌ర్ల మున్సిపాలిటి

సికింద్రాబాద్ కంటోన్మెంట్

సిరిసిల్ల మున్సిపాలిటి

తుర్క‌యాంజ‌ల్ మున్సిపాలిటి

వేముల‌వాడ మున్సిపాలిటి

Advertisement

తాజా వార్తలు

Advertisement