Thursday, May 2, 2024

రోడ్ సేప్టీకి తెలంగాణ రాష్ట్రానికి రూ.320కోట్లు రిలీజ్ చేసిన ‘వ‌ర‌ల్డ్ బ్యాంక్’

రోడ్ సేప్టీకి వ‌ర‌ల్డ్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రానికి రూ. 320కోట్ల‌ని రిలీజ్ చేసింది. ఈ విష‌యాన్ని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. హైద‌రాబాద్ బిఆర్ కే భ‌వ‌న్ లో రోడ్లు , ర‌వాణా , పోలీస్ శాఖ‌ల అధికారులతో పాటు వరల్డ్ బ్యాంక్ టీం తో సి ఎస్ సోమేష్ కుమార్ రివ్యూ నిర్వహించారు. వెహికల్స్, రోడ్ నెట్వర్క్ పొడవు, రోడ్డు ప్రమాదం మరణాల ఆధారంగా దేశంలోని 14 రాష్ట్రాలకు ప్రపంచబ్యాంక్.. రూ. 6,725 కోట్ల నిధులు కేటాయించిందని అందులో తెలంగాణ రాష్ట్రానికి 320 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డించారు.

రోడ్ యాక్సిడెంట్ ల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సి ఎస్.. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. ఈ మీటింగ్ లో బ్యాంక్ ప్రతినిధులు ఆర్నాబ్ బందోపాధ్యాయ, వెంకట్రావు, విజేత బెజ్జం, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, అడిషనల్ డిజిపి జితేందర్, ఇతరులు పాల్గొన్నారు. మ‌రి ఈ మేర‌కు తెలంగాణ ర‌హ‌దారులు ఏ మేర‌కు మెరుగ‌వుతాయో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement