Sunday, June 23, 2024

Telangana: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే టాప్ ప్లేసులో తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు సంస్కరణలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు పలుశాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అభినందించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నిబంధనల పటిష్టంగా అమలుకు కార్యాచరణ రూపొంచేందుకు బుధవారం బీఆర్‌కే భవన్‌లో పలుశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య ప్రోత్సహాకాలకు అనుకూల విధానాలు ఉండేలా ప్రస్తుతవ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎస్‌ చెప్పారు.

మెరుగై న సమాచార మార్పిడి, పారదర్శకతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు తమ శాఖల పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈఓడీబీ సంస్కరణల అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, ఫలితాల ఆధారంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. దాదాపు 540 సంస్కరణలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement