Thursday, April 25, 2024

వాక్సిన్ కొరత ఉంది: కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇప్పుడు గట్టిగానే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఇటు తెలంగాణ సర్కారు తమ వద్ద వ్యాక్సిన్ కొరత ఉందని కేంద్రానికి లేఖ రాసింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర కేవలం మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే ఉన్నాయని కేంద్రానికి తెలిపింది. ప్రతిరోజు తెలంగాణ ప్రభుత్వం 2లక్షల కరోనా వ్యాక్సిన్లను ఇస్తున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ రాష్ట్రానికి 15 రోజులకు సరిపడా వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని తెలంగాణ సిఎస్ కేంద్రానికి లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement