Monday, May 6, 2024

Breaking: లైట్​ తీస్కున్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్​లో సఫారీలపై ఓటమి

సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 మూడు మ్యాచ్​ల సిరీస్​లో ఆఖరి మ్యాచ్​లో సౌతాఫ్రికా భారీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​కు విరాట్​ కోహ్లీకి రెస్ట్​ ఇచ్చారు. ఇక.. బౌలింగ్​లోనూ టీమిండియా కుర్రాళ్లు చాలా పూర్​ అనిపించుకున్నారు. దీంతో సఫారీలు 227 పరుగుల అత్యధిక స్కోర్​ చేశారు. అయితే.. దీటుగా ఆడాల్సిన బ్యాట్స్​మన్​ కూడా లైట్​ తీస్కోవడంతో వెంట వెంటనే వికెట్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్​లో కూడా గెలిచి క్లీన్​ స్వీప్​ చేస్తారనుకున్న క్రికెట్​ అభిమానుల ఆశలపై టీమిండియా ప్లేయర్లు నీళ్లు చల్లారు. ఇక.. కెప్టెన్​ రోహిత్​ శర్మ (0) డకౌట్​ కాగా, శ్రేయస్​ అయ్యర్​ (1)పరుగుతో నిరాశపరిచారు. ఇక.. రిషబ్​ పంత్​ (27) కాసేపు దీటుగానే ఆడాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్​ (46) మాంచి ఫామ్​లో ఉన్నట్టు అనిపించి సిక్సులతో మోతెక్కిస్తుండగానే అవుటయ్యాడు.​ ఈ క్రమంలో తొలి రెండు మ్యాచ్​లలో స్కై యాదవ్​గా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్​ (8) కూడా ఇవ్వాల అంతగా ఆకట్టుకోలేదు. సిక్స్​ బాదబోయి లాంగాఫ్​లో ఫీల్డర్​కి చిక్కాడు. దీంతో 87 పరుగులకే టీమిండియా కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది.  

ఆ తర్వాత 12 ఓవర్లలోనే హర్షల్​పటేల్​ (17), అక్షర్​ పటేల్​ (9), రవిచంద్రన్​ అశివన్​ (2) పరుగులకే పెవిలియన్​ చేరారు. దీంతో 120 పరుగుల వద్ద టీమిండియా 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినట్టయ్యింది. చివరాఖర్లో దీపక్​ చాహర్​ (31), ఉమేశ్​ యాదవ్​ (20), సిరాజ్​ (5) కలిసి సఫారీ బౌలర్లను కాసేపు బాగానే ఆడుకున్నారు. దీంతో 49 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలయ్యింది. 2.1 తేడాతో సిరీస్​ని కైవసం చేసుకుంది టీమిండియా.

Advertisement

తాజా వార్తలు

Advertisement