Saturday, May 4, 2024

TANA – రాజకీయాల్లోకి నీతిమంతులు రాకపోతే నీతిలేని వారే రాజ్యమేలుతారు – జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ఫిల‌డెల్ఫియా – అమెరికా …. నేటి రాజ‌కీయాలు పూర్తిగా భ్ర‌ష్టుప‌ట్టాయ‌ని సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జ‌స్టీస్ ఎన్ వి ర‌మ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాజకీయాల్లో వికృత ఘటనలు చూస్తున్నామని అన్నారు. అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జరుగుతున్న 23వ తానా మహాసభల్లో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగిస్తూ, పార్టీల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలతో సంబంధం లేనివారు పార్టీలెలా నడుపుతార‌ని,రాజకీయాల్లో ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తూ, అభూతకల్పనలతో అభాసుపాలు చేస్తున్నార‌ని అన్నారు. దుష్ప్రచారమే ఎన్నికల వ్యూహంగా మారింద‌ని . మేనిఫెస్టో గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింద‌ని వివ‌రించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్ర‌జ‌ల‌ను పక్కదోవ పట్టిస్తున్నార‌ని అంటూ ప్రలోభ అంశాలకు ప్రాధాన్యత పెంచి ఓట్లు దండుకుంటున్నార‌ని విమ‌ర్శించారు..

ప్రజాస్వామ్యం పరాజయం పాలవుతోందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. యువత, మేధావులు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాజకీయాల్లో నీతిమంతులు రాకపోతే నీతిలేని వారే రాజ్యమేలుతారని కోట్ చేశారు.. .వారు చేసే నష్టాన్ని పూడ్చడానికి దశాబ్దాలు పడుతుంద‌ని వివ‌రించారు…ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు తెలుగువారు విశ్రమించొద‌ని పిలుపు ఇచ్చారు. విద్యార్థులను రాజకీయాలకు దూరం చేయడం వల్లే అథోగతి పాలవుతున్నామ‌ని,. కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.” అని ర‌మ‌ణ పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement