Friday, April 26, 2024

జల్లికట్టులో.. 14ఏళ్ల బాలుడు మృతి

పొంగల్ పండగలో భాగంగా తమిళనాడు ధర్మపురిలో జల్లికట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మపురిలో నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు గోకుల్‌ అనే 14 ఏండ్ల బాలుడు బంధువులతో కలిసి వచ్చాడు. బాలుడిని ఎద్దు పొడవడంతో అతడి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడ్లను పట్టుకునే కార్యక్రమాన్ని చూస్తున్న బాలుడి వద్దకు ఎద్దు ఎలా వచ్చిందనే దానిపై జల్లికట్టు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, జల్లికట్టులో ఇప్పటివరకు అరవింద్‌ రాజ్‌, శివకుమార్‌, కలైముట్టి గణేశన్‌ సహా ఇద్దరు ప్రేక్షకులు కూడా ఎడ్లు కుమ్మడంతో చనిపోయారు. గోకుల్‌తో జల్లికట్టు మృతుల సంఖ్యల ఆరుకు చేరింది.ఈ ఆట పొంగల్ పండుగలో భాగంగా నిర్వహిస్తారు. ఒక ఎద్దును జనంలోకి వదలగా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే ఆటగా జల్లికట్టును వర్ణిస్తారు. జల్లికట్టు పోటీలో పాల్గొనేందుకు 300 ఎడ్లలను, 150 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉండగా, దాదాపు 10 వేల ఎడ్లు, 5,400 బుల్ టామర్లు రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, 800 ఎద్దులకు మాత్రమే పోటీలో పాల్గొనేందుకు అనుమతి లభించినట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో ఆరుగురు చనిపోగా.. తొమ్మిది మంది ఎడ్లను నిలువరించి విజేతలుగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement