Saturday, July 27, 2024

త‌మిళ సూప‌ర్ స్టార్ కి బ‌ర్త్ డే విషెష్ తెలిపిన మోడీ : స్టాలిన్, స‌చిన్ కూడా

నేడు త‌మిళ‌స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ 72వ పుట్టినరోజు. ప‌లువురు సెల‌బ్రిటీలు, రాజ‌కీయనాయ‌కులు ఆయ‌న‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కాగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. ర‌జ‌నీకాంత్ కి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌జేశారు. ఇంకా ఆయ‌న ట్వీట్ లో ఏం రాశారంటే .. రజనీకాంత్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తన సృజనాత్మకత , అద్భుతమైన నటనతో ప్రజలను స్పూర్తిగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. సర్వశక్తిమంతుడు అతనికి దీర్ఘాయువు , ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించుగాక” అంటూ మోడీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.

కాగా తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కూడా తమిళ సినిమా సూపర్ స్టార్ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు . 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్‌కు మరికొన్నేళ్ళు తన సాటిలేని స్క్రీన్ ప్రెజెన్స్‌తో తమిళ ప్రజలను అలరించాలని కోరుకుంటున్నట్లు స్టాలిన్ తమిళంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.హ్యాపీ బర్త్ డే మై తలైవా!! ది వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ రజినీకాంత్ సార్.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.” అంటూ ధనుష్ శుభాకాంక్షలు తెలియజేశారు.క్రికెట్ గాడ్ సచిన్ ట్విట్టర్ లో “హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్ సర్. మీ మంచి ఆరోగ్యం , జీవితంలో సంతోషం కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాన‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement