Monday, May 6, 2024

చెత్త కుప్ప పక్కన కుక్కతో విలన్ ప్రచారం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులోని తొండముత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు మన్సూర్ అలీఖాన్. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. ఓ చెత్తకుండీ వద్ద కూర్చున్న ఆయన పెన్ను, పేపరు పట్టుకుని సమస్యలుంటే తనకు నివేదించాలని ప్రజలను కోరుతున్నారు. ఆయన పక్కనే ఓ వీధి కుక్క కూడా ఉండడం చూపరులను ఆకట్టుకుంటోంది.  రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని బాటసారులకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement