Friday, May 17, 2024

సిలిండ‌ర్ తీసుకుంటే – ‘ఆర్ ఆర్ ఆర్’ టిక్కెట్లు ఫ్రీ

అభిమాన హీరోలు న‌టించిన సినిమాతో వ్యాపారం పెంచుకునేందుకు గుంటూరు జిల్లా దుగ్గిరాల శాఖ‌కు చెందిన ఓ వ్యాపారి వినూత్న ఐడియా వేశాడు. హెచ్ పీ గ్యాస్ ఓన‌ర్ శ్రీనివాస‌రావు ..సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే ఉచితంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌ టికెట్లు అందజేస్తామని ఏజెన్సీ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో కొందరు అభిమానులు సిలిండర్‌ కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురు వినియోగదారులు సిలిండర్లు బుక్‌ చేసుకున్నారని ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో బాహుబలి-2 చిత్రానికి కూడా ఇదే రీతిలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేసి దుగ్గిరాల ప్రజలను ఆకట్టుకున్నాడు శ్రీనివాసరావు. మామూలోడు కాదండోయ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement