Friday, April 26, 2024

Breaking: అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు తెలిపింది. మహిళలందరికీ అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లి కాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని పేర్కొంది. అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవివాహిత మహిళలకు తేడా లేదని సుప్రీంకోర్టు తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని, భార్యతో బలవంతపు శృంగారాన్ని సుప్రీంకోర్టు నేరంగా పరిగణించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement