Thursday, May 2, 2024

జల్లికట్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టు జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్లికట్టుపై ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక వారసత్వానికి జల్లికట్టు చిహ్నం అని… వారసత్వ పరిరక్షణకు చట్టాలు చేసే అధికారం తమిళనాడు రాష్ట్రానికి ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో ఎలాంటి లోపం లేదని వివరించింది.

సాంస్కృతిక వారసత్వంపై తగిన నిర్ణయం తీసుకోవడంలో చట్టసభలదే తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది. కంబాల, ఎడ్ల పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక చేసిన సవరణలు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement