Friday, May 10, 2024

కొవిడ్ సహాయ చర్యలకు రూ.30 కోట్ల విరాళం: సన్ రైజర్స్ హైదరాబాద్

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ భారీ విరాళం ప్రకటించింది. దేశంలో కొవిడ్ సహాయచర్యలకు రూ.30 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కొవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాల కోసం అందిస్తున్నట్టు సన్ టీవీ వివరించింది. సన్ టీవీ అధీనంలోని అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు వెల్లడించింది. తద్వారా భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement