Friday, May 17, 2024

ఏప్రిల్ 24 నుంచి సమ్మర్​ హాలిడేస్​, 7 నుంచి వార్షిక పరీక్షలు

తెలంగాణ‌లోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల విద్యాశాఖ తెలిపింది. మ‌ళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయ‌ని విద్యాశాఖ తెలియజేసింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్సే -టు పరీక్షలు ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 చివరి పని దినంగా ఉంటుంది. కాగా మే 23 నుంచి మే 28వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement