Thursday, June 13, 2024

ఆప్ఘ‌న్ విదేశాంగ కార్యాల‌యం వ‌ద్ద ఆత్మ‌హుతి దాడి.. ఆరుగురు మృతి

ఉగ్ర‌వాదులు మ‌రోసారి మార‌ణ‌హోమం సృష్టించారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం దగ్గర ఆత్మహుతి దాడికి పాల్పడటంతో ఆ ప్రాంతమంతా భయాందోళనకంగా మారింది. ఈ సూసైడ్ ఎటాక్ లో ఏకంగా ఆరుగురు మరణించారు. అంతే కాదు.. పలువురికి గాయాలు అయ్యాయి. మృత్యుల్లో ఒక చిన్నారి ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉగ్ర దాడిలో గాయపడిన వారిలో 12 మంది పౌరులు, ముగ్గురు భద్రత సిబ్బంది ఉన్నారు. ఆఫ్ఘన్ విదేశాంగ కార్యాలయం సమీపంలోని ఒక వ్యాపార కేంద్రంలో సూసైడ్ ఎటాక్ జరిగింది. ఈ ఎటాక్ లో ఆరుగురు ఆఫ్ఘన్ పౌరులు మరణించగా, పలువురు గాయపడ్డారు. భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని గుర్తించారు భద్రత దళాలు. ఆ వ్యక్తిని భద్రతలాలు పట్టుకునే లోపే తనను తాను పేల్చుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement