Friday, April 26, 2024

Story : ప్ర‌పంచంలోనే సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే జాబితాలో.. హైద‌రాబాద్

ప్ర‌పంచంలోనే సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే జాబితాలో చేరింది హైద‌రాబాద్. జనాలు సురక్షితంగా ఉండాలంటే భద్రత నిఘా ముఖ్యం. ఇందుకు నగరాల్లో సీసీ టీవీ కెమెరాలు చాలా ముఖ్యం. నేరాల అదుపు క్రైమ్ రేట్ తక్కువగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అందుకు సీసీటీవీ కెమెరాలు శాంతిభద్రతలు ఉండాలి. అవి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మెట్రో పాలిటిన్ నగరాల్లో భద్రతకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఉద్యోగాలు ఉపాధి పేరుతో చాలా మంది ఇటీవల కాలంలో నగరాల్లోకి మారుతున్నారు. పెరుగుతున్న జనాభాకు భద్రత కల్పించడం సవాలుగా మారుతోంది. నేరాల అదుపునకు సీసీటీవీలు అవసరం. ఒక్క సీసీ టీవీ కెమెరా పది మంది పోలీసులతో సమానం. దీంతో నగరాల్లో ప్రతీ గ్రామంంలో భద్రత కట్టుదిట్టమైంది. సీసీ కెమెరాలను ప్రతీ గ్రామాలు వీధుల్లో నగరాల్లో ఉపయోగిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘా ఎక్కువ ఉన్న నగరాల జాబితా వెల్లడైంది. టాప్ 10 నగరాల్లో భారతీయ నగరాలే ఎక్కువ ఉండడం విశేషం. భారత్ నుంచి ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. ఢిల్లీ చెన్నై నగరాలు కూడా ప్రపంచంలోనే అత్యంత పనితీరు కనబరిచాయి. ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఉంది చైనాలోని బీజింగ్ నగరం. ఇక్కడ ప్రతీ 1000 మందికి 372.8 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 62.52 కెమెరాలతో రెండో స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలోనే మూడో స్థానం హైదరాబాద్ కు దక్కింది. ఇక్కడ ప్రతీ 1000 మందికి 41.80 కెమెరాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ 26.7 శాతంతో నాలుగో స్థానంలో.. చెన్నై 24.53 స్థానంతో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లండన్ బ్యాంకాక్.. న్యూయార్క్ ..ఇస్తాంబుల్.. పారిస్.. బెర్లిన్ నగరాలు ఉన్నాయి.ఇవన్నీ కూడా మన భారతీయ నగరాల తర్వాతే ఉండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement