Friday, April 26, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.ఈ రోజు మధ్యాహ్నం మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ… ఆ తర్వాత భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఆటొమొబైల్, టెక్నాలజీ, ఫార్మా స్టాకుల అండతో మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 443 పాయింట్లు లాభపడి 52,265కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,556 వద్ద స్థిరపడింది. మారుతి (6.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.41%), ఏసియన్ పెయింట్స్ (3.39%), భారతి ఎయిల్ టెల్ (2.96%), టీసీఎస్ (2.70%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. రిలయన్స్ (-1.62%), ఎన్టీపీసీ (-0.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.90%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement