Friday, April 19, 2024

అంత‌రిక్షంలో అద్భుతం – ఒకే స‌ర‌ళ‌రేఖ‌లో ఐదు గ్ర‌హాలు

సూర్యుడు చుట్టూ తిరిగే ఐదు గ్ర‌హాలు ఒకే స‌ర‌ళ‌రేఖ‌లో క‌నిపించ‌నున్నాయి. బుధుడు.. శుక్రుడు ..అంగారకుడు ..బృహస్పతి.. శని గ్రహాలు రేపు అంటే శుక్ర‌వారం ఒకే వరుసలోకి రానున్నాయి. ఈ 5 గ్రహాలు 2004 డిసెంబర్ లో ఇలా ఒకే సరళరేఖలో కనిపించి కనువిందు చేశాయి. 18 ఏళ్లకోసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని అంతరిక్షంలో మరోసారి శుక్రవారం చూడొచ్చు. ఇలా గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెట్ పరేడ్ అంటారు.గంట సమయం పాటు ఈ 5 గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి. దీన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్ బైనాక్యులర్ అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చు.సూర్యుడికి అత్యంత సమీపంలో బుధుడు ఉండడం వల్ల మామూలు సమయాల్లో చూడడం చాలా కష్టం. కానీ జూన్ 24న సూర్యుడి నుంచి బుధుడు దూరంగా జరగడం వల్ల స్పష్టంగా చూసేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement