Tuesday, May 7, 2024

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సాంబార్ పౌడర్

సోషల్ మీడియాలో ‘బ్రాహ్మీణ్ సాంబార్’ వైరల్‌గా మారింది. పలు సంస్థలు ‘బ్రాహ్మీణ్ సాంబార్’ను ప్రత్యేకంగా తయారు చేస్తూ తమ ఉత్పత్తులకు ప్రమోషన్స్ ఇస్తున్నాయి. దీంతో పలువురు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. తినే పదార్థాలను కూడా కులం ప్రతిపాదికన విభజన చేయడం మంచిది కాదని కొందరు కామెంట్లు చేస్తుంటే.. ‘క్రిస్టియన్ సాంబార్’, ‘ముస్లిం సాంబార్’లను కూడా తేవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి తెచ్చి ప్రజల్లో చిచ్చు పెట్టవద్దని పలువురు హితవు పలుకుతున్నారు.

అయితే ‘బ్రాహ్మీణ్ సాంబార్’ తేవడం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని.. సాధారణంగా బ్రాహ్మణులు అల్లం, వెల్లుల్లి, మసాలాలను వారి వంటకాలలో వాడరని.. దీంతో పలు సంస్థలు వారి కోసం ప్రత్యేకంగా సాంబార్ పౌడర్‌లను విక్రయిస్తున్నాయని.. ఇందులో తప్పేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement