Friday, May 17, 2024

పలాసలో అమానుషం.. బైక్ పైనే 20 కిలోమీటర్లు తల్లి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరంతో పాటు మానవత్వాన్ని దూరం చేసింది. మనుషుల్లో మరింత అంతరాన్ని పెంచుతోంది. ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నా.. కరోనా అనే భయంతో కనీసం కన్నేత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో అమానుషం ఘటన చోటుచేసుకుంది. కోవిడ్ తో మరణించిందని మహిళను తీసుకెళ్లేందుకు అంబులెన్సులు నిర్వహకులు నిరాకరించారు. దీంతో 20 కిలోమీటర్లు బైక్ పైనే తీసుకెళ్లాడు కొడుకు. మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన జి.చెంచుల(50) అనారోగ్యానికి గురికావడంతో కుమారుడు ఇంకో వ్యక్తి సహాయంతో ద్విచక్రవాహనంపై పలాసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా ప్రథమ చికిత్స అనంతరం స్కానింగ్ నిమిత్తం కాశీబుగ్గ గాంధీ నగర్ లో ఉన్న మరో ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ స్కానింగ్ అనంతరం తల్లి మృతి చెందింది. ఆమె కరోనాతో మృతి చెందిందని మృతదేహాన్ని స్వగ్రామం కిల్లోయి తీసుకువెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు, అంబులెన్స్ సిబ్బందిగాని ముందుకు రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ద్విచక్రవాహనంపై తీసుకువెళ్తున్నామని చెంచుల కుమారుడు కన్నీరు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement