Wednesday, May 1, 2024

భార‌త్ లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు ప్ర‌స్తుతం కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. అలాగే దేశంలోని 29 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌వుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ, వీకెండ్ క‌ర్ఫ్యూల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెల‌సిందే… అయితే ఆదివారం న‌మోదైన కేసుల కంటే ఈ రోజు 5 శాతం త‌క్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 385 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 16,56,341 క‌రోనా యాక్టీవ్ కేసులున్నాయి. క‌రోనా కేసుల్లో స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టినా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెర‌గ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 8209 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. సుమారు 157 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement