Wednesday, June 12, 2024

ఏపీ,తెలంగాణ సీఎంల‌కు కృత‌జ్ఞ‌త‌లు – స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ట్వీట్

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి .. ఏపీ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీలో సినిమా టికెట్స్ రేట్ల‌ను పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా జీవో జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో.. సినీ పరిశ్రమ మరింత పుంజుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవో ఇచ్చిన ఏపి సిఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు. కొత్త జీవోలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సిఎం జగన్ కి.. మంత్రి పేర్ని నాని కి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.. . “పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మాకు మీ నిరంతర మద్దతు కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. తెలంగాణాలో ఇది సినీ వర్గానికి పెద్ద ఊరటనిస్తుది” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‏కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement